calender_icon.png 21 February, 2026 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ‌ల‌న్న స్వామి ఆల‌యంలో ఎమ్మెల్సీ పూజ‌లు

21-02-2026 06:10:43 PM

మునిపల్లి,(విజయక్రాంతి): మండ‌లంలోని కంకోల్  - మొగ్దుంప‌ల్లి  గ్రామాల శివారులో గ‌ల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి జాత‌రోత్స‌వాలు గ‌ల మూడు రోజులుగా జ‌రుగుతున్నాయి. ఈ పూజా కార్య‌క్ర‌మాలు వివిధ ఆల‌యాల పీఠాధిప‌తుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే శ‌నివారం స్వామి వారి జాత‌రోత్స‌వాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.  ముందుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆల‌య అర్చ‌కులు,  బీజేపీ నాయ‌కులు, గ్రామ‌స్తులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం అంజిరెడ్డి మాట్లాడుతూ... ప్ర‌తి ఒక్కరు భ‌క్తితో స్వామివారిని ద‌ర్శించుకుంటే ముక్తి దొరుకుతుంద‌న్నారు. ఈ పూజా కార్య‌క్ర‌మాలు సంస్థాన్ మ‌ఠ్ - బిచ్కుంద  పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ సోమేశ్వ‌ర శివాచార్య మ‌హాస్వామి , బ‌ర్దీపూర్ ఆల‌య పీఠాధ‌ప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ  108 వైరాగ్య శిఖామ‌ణి అవ‌దూత గిరి మ‌హారాజ్, హీరెమాత ధ‌న్మ‌ల‌క్ష్మి పీఠాధితి శ్రీెశ్రీ‌శ్రీ వీరేశ్వ‌ర శివాచార్య మ‌హాస్వామి, తంగెడ‌ప‌ల్లి కోటి లింగేశ్వ‌ర ఆల‌య పీఠాధిప‌తి శ్రీెశ్రీ‌శ్రీ శివ‌యోగి శివాచార్య మ‌హాస్వామి , కౌళాస్ మ‌ఠం పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ మ‌ల్లికార్జున శివాచార్య మ‌హాస్వామి,

కొండాపూర్ హ‌నుమాన్ ఆల‌య పీఠాధిప‌తి శ్రీెశ్రీ‌శ్రీ సంగ్రామ్ మ‌హారాజ్,  ముంగి ఆదిల‌క్ష్మి ఆల‌య పీఠాధిప‌తి శ్రీెశ్రీ‌శ్రీ దేవ‌గిరి మ‌హారాజ్, రంజోల్ రాజ‌యోగాల‌య పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌త  గౌర‌వ‌ర‌త్న డాక్ట‌ర్ మ‌ఠం రాచ‌య్య స్వామి, దిగ్వాల్ కాశీ విశ్వేశ్వ‌ర పుణ్య క్షేత్రం  పీఠాధిప‌తి శ్రీెశ్రీ‌శ్రీ మడ‌ప‌తి శివ శంక‌ర‌య్య స్వామితోపాటు బ‌ర్దీపూర్ సంస్థాన్ వైదిక విద్యాభూష‌న్ పురోహితుడు శివ‌శ్రీ రావికోటి మ‌ఠం శివ‌శ‌క్తి శాస్త్రి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక  పూజ‌లు జ‌రుగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఉపాధ్య‌క్షుడు వెంక‌ట న‌ర్సింహ్మ రెడ్డి,  స‌దాశివ‌పేట, మునిప‌ల్లి మండ‌లాల అధ్య‌క్షులు ఆదిత్య, నాగిశెట్టి,  ఆలయ అధ్యక్షుడు  గడ్డమీది వీరన్న పటేల్. ఉపాధ్యక్షుడు శేఖర్ పటేల్, గ్రామ పెద్దలు, ఆల‌య క‌మిటీ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.