calender_icon.png 29 October, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతకు ముందడుగు.. ఇందిరా మహిళా శక్తి పథకం

28-10-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్  బాషా షేక్ 

జనగామ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి, పథకంలో భాగంగా...  ఏర్పాటుచేసిన వనిత టీ స్టాల్ లను  జిల్లాలో స్వయం సహాయక సభ్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జనగాం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాల్, ను  అలాగే కలెక్టరేట్ బయట  పెట్టిన మిల్క్ పార్లర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు  ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు. ఇది ఒక సువర్ణ  అవకాశామని.. మహిళ లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాల్ లను SHG సభ్యులు విజయవంతం గా నిర్వహిస్తున్నారని.. బయట  షాప్ లతో పోలిస్తే.. వనిత టీ స్టాల్ పైన ప్రజల కు నమ్మకం పెరుగుతుందన్నారు.

దీన్ని ఇలాగే నిలబెట్టుకోవాలని.. రోజు రోజుకి వ్యాపారం బాగా అభివృద్ధి అయ్యేలా జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. నిత్యం టీ స్టాల్ పరిసరాలు శుభ్రం గా పెట్టుకోవాలని... రుచి కరమైన టీ ని వినియోగదారులకు అందించాలన్నారు. మున్ముందు విభిన్న మైన వ్యాపారాలను చేపట్టే విధంగా స్వయం సహాయక సభ్యులు ముందుకు రావాలన్నారు.

వడ్లకొండ గ్రామం లోని ఓం సాయి సంఘ సభ్యురాలు స్రవంతి 2 లక్షల 50 వేల రూపాయలతో వనితా టీ స్టాల్ ను అలాగే.. చీట కోడూరు లోని కస్తూరి స్వయం సహాయక సభ్యురాలు విజయలక్ష్మి 2 లక్షల 50 వేల బ్యాంకు లింకేజి ఋణలతో మిల్క్ పార్లరను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ వసంత అడిషనల్ డిఆర్డిఓ, డి పి ఏం లు, SHG సభ్యులు తదితరులు పాల్గొన్నారు.