06-12-2025 04:44:17 PM
నూతనకల్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో జై బీమ్ యూత్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి, వారి సేవలను, ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఇరుగు వెంకటేష్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇరుగు నగేష్, ఉపాధ్యక్షులు నాయకపు నాగరాజు, సురేష్, మహేష్, రాజేష్, నవీన్, మహేష్ తదితర సంఘం సభ్యులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.