06-12-2025 04:46:32 PM
వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణం కోరుట్ల బస్టాండ్ లో నూతనంగా ఏర్పటుచేసిన భీమన్న మెడికల్ ఫార్మసీని శనివారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ యువత ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపాలని కోరారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రె పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.