12 May, 2026 | 12:09 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

07-08-2025 12:34 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, ఆగస్టు 06 : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.  బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో నిర్వహించిన ప్రొఫె సర్ జయశంకర్ జయంతి వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.

కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అహర్నిశలు పాటుపడిన గొప్పవ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. స్వరాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో భాను ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

గద్వాల, ఆగస్టు 06 : తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా, ఆశయంగా భావించి తన జీవితాంతం తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అ ని అన్నారు.

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఉద్యమ నాయకుడిగానే కాక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ,రాష్ట్ర భవిష్యత్ దిశను సైద్ధాంతికంగా నిర్దేశించిన మహా మేధావి అని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి నుషిత, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.