07-08-2025 12:34:30 AM
కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్, ఆగస్టు 6(విజయ క్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేసారు. పాఠశాల విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యత మైన విద్యను అందించాలని సూచించారు.
విద్యార్థులతో కలిసి కూర్చొని విద్యా బోధనను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పాఠశాల ఆవరణంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనాన్ని అందించాలన్నారు.మోడల్ స్కూల్ పాఠశాల ఆవరణంలో చుట్టుపక్కల పిచ్చి గడ్డి మొక్కలు, ముళ్ళ చెట్లు తొలగించాలని, శుభ్రంగా ఉంచాలని అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని గ్యాస్ పొయ్యి మీదనే చేయాలని వంట సరుకులను నాణ్యతంగా ఉండేలా చూడాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.
అదేవిధంగా కిచెన్ గార్డెన్ వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ నుఆదేశించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధి విధానంను విద్యార్థులతో క్లాస్ రూమ్ లో కలిసి కూర్చొని పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, డి ఈ ఓ రామ్,ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ రవీందర్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.