17 June, 2026 | 2:38 AM

అందరూ చెప్పులు బయటే వదిలి సెట్‌లోకొచ్చేవారు!

17-06-2026 12:53 AM

విరాట్ కర్ణ హీరో గా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కు తున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబం ధం: ది సీక్రెట్ ట్రెజర్’. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిం చారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా డీవోపీ ఎస్ సౌందరరాజన్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. “అభిషేక్ చాలా పెద్ద విజన్‌తో ఈ కథను మొదలుపెట్టారు. నేను స్క్రిప్ట్ దశ నుంచే ఈ ప్రాజెక్టులో భాగమయ్యా. ‘నాగబంధం’ ఐడియా మా అందరినీ ఎంతగానో ఉత్సాహపరిచింది. మొదట కథను లాక్ చేశాం. తర్వాత దాన్ని విజువల్‌గా ఎంత గొప్పగా, ఆకట్టుకునేలా చూపించాలో ప్లాన్ చేశాం. -విజువల్ ఎఫెక్ట్స్ సహజంగా కనిపించడం చాలా పెద్ద టాస్క్. ఈ సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ అన్నీ కూడా చాలా నేచురల్‌గా, రియల్‌గా ఉంటాయి.

నేను, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ కలిసి చాలా దేవాలయాలు తిరిగాం. తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించాం. ప్రతి అంశాన్ని ఫొటోగ్రాఫ్ చేశాం. ఆ ఆలయాన్ని ఆధారంగా చేసుకున్నప్పటికీ సినిమాలో శ్రీరంగపురం అనే పేరు పెట్టాం. శ్రీరంగం, తిరువనంతపురం ప్రాంతాల వైభవాన్ని కలిపేలా ఆ పేరు నిర్ణయిం చాం. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అద్భుత సెట్లు వేశారు. అభిషేక్ నామా విజన్‌కు నిర్మాతలు ఎంత గానో సపోర్ట్ చేశారు. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మించారు.

ఈ సినిమా హైలైట్ అనంత పద్మనాభస్వామి టెంపుల్, అక్కడ జరిగే సన్నివేశాలు. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఓ భారీ విగ్రహాన్ని రూ పొందించాం. ఈ వర్క్‌లో దేశంలోని ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు. షూటింగ్ సమయం లో ప్రతిఒక్కరూ ఎంతో భక్తిభావంతో ఉండేవారు. చెప్పులు బయటే వదిలి సెట్స్‌లోకి వచ్చేవారు. షూ టింగ్ ప్రారంభానికి ముందు ప్రత్యేకంగా నియమించిన అర్చకుడు పూజలు నిర్వ హించిన తర్వాతే షూటింగ్ చేసేవాళ్లం.

ట్రావెన్కోర్ ప్రధాన అర్చకుడిని కలిసి ఎన్నో విషయాలు తెలుసుకుని, చాలా చిన్న విషయాలనూ సినిమాలో పొందుపరిచాం. -చాలా పెద్ద సెట్లలో తీసిన సిని మా ఇది. ఆ మొత్తం సెట్‌ను ఒకే షాట్లో చూపించడం నాకు చాలెంజ్‌గా అనిపించింది. అందుకోసం చాలా ఖరీదైన డ్రోన్ ఉపయోగించాం. ఆలయ ప్రవేశ ద్వారం నుంచి పద్మనాభస్వామి విగ్ర హం వరకు ఒకే షాట్లో చిత్రీకరించాం. దానికోసం చాలా రిహార్సల్స్, అనేక టేక్స్ తీసుకున్నాం. ఆ షాట్ అద్భుతంగా వచ్చింది. మ్యూజిక్ కూడా చాలా డివైన్‌గా ఉంటుంది” అని వివరించారు.