1 July, 2026 | 10:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అన్నీ మారాయి

10-03-2025 12:00 AM

మా నానమ్మ 

మిఠాయిల్ని తక్కెట్లో

సేర్లూ సవ్వాసేర్లుగా తూచేది

అమ్మమ్మ గుమ్మిల్లోని వడ్లని

సోలల్లో కుంచేల్లో కొలిచేది

తాతేమో తాను తిరిగి తిరిగి వచ్చిన

వూర్లని కోసుల్లో మైళ్ళల్లో చెప్పేది

నాన్న వరకొచ్చేసరికి

కిలోమీటర్లు కిలోగ్రాములూ

క్వింటాళ్ళు వచ్చాయి

అంతా మంచీ చెడ్డా లెక్కలేసే వాళ్ళు

ఇప్పుడేమో అందరూ 

అందరినీ అన్నింటినీ

డాలర్లూ పాకేజీల్లో కొలుస్తున్నారు

కొలిచి మురుస్తున్నారు

కాలంతోపాటు 

అన్ని కొలతలూ మారాయి

అన్ని కొరతలూ పెరిగాయి 

- వారాల ఆనంద్