1 July, 2026 | 11:07 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మాటలెందుకు?

10-03-2025 12:00 AM

రమణా!

ఏమిటీ గోల

ఎవరు మాట్లాడకుండా ఉండలేరా

నీ మాట విని

రోజంతా నిశ్శబ్దంగా గడిపాను

మౌనం ఏ పనికి ఆటంకం కాలేదు!

మాట అక్కరలేని ప్రపంచం

ఎంతో అందంగా కనిపించింది

గాలి పలకరించింది

పరిమళం ముచ్చటించింది

ఆకలి హెచ్చరించింది

దాహం గుర్తు చేసింది

దేనికి మాటలతో పనిలేదు

మాట్లాడి మాట్లాడి మనం

డొల్లగా మిగిలిపోతున్నామా?

మొన్నీమధ్య మాట్లాడుకుందాం రా అని

వైట్‌హౌస్‌లో ఇద్దరు

ఒకరిమీద ఒకరు దుమ్మెత్తుకు పోసుకుని

ఎవరి దారిన వారు విడిపోయారు! 

సొరంగంలో ఎనిమిదిమంది మనకోసం

ప్రాణాలను గాలిలో కలిపేసుకుంటుంటే

బయట ఎంతమంది ఎంత గోల

ఇప్పుడు మాట్లాడడం

నాకు మహా సిగ్గనిపిస్తుంది!

ఏమి మాట్లాడకుండానే

అనాదిగా ఆకాశం, హిమాచలం

ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి

మా నల్లకుక్క అంతే

తనకిష్టం లేనప్పుడు

దొంగలు వచ్చిపోయినా మొరగదు

దానికదో తృప్తి!

నీ ఆశ్రమ దర్శనానంతరం

కలిసిమెలిసి బ్రతకడం అంటే

మౌనంలోకి జారిపోవడమే

జీవితమూ జీవమూ అనిపించింది!!

- కోట్ల వెంకటేశ్వర రెడ్డి