08-12-2025 08:54:48 AM
హైదరాబాద్: తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నేడు, రేపు హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) నిర్వహిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా రానున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. తెలంగాణ ఉజ్జ్వల్ లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికను రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ప్రారంభోత్సవం తర్వాత వివిధ రంగాల ప్రతినిధుల బృందంతో సీఎం భేటీలు కానున్నారు. ప్రతి పావుగంటకు సీఎం వన్ టూ వన్ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 7 వరకు దాదాపు 15 సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో విందులో ఆయన పాల్గొంటారు.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు 44 దేశాలకు చెందిన ప్రతినిధులు రానున్నారు. తెలంగాణ రైజింగ్ థీమ్ పేరుతో వివిధ రంగాల ప్రముఖులు ఒకే వేదికపైకి చేరనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వివధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖర్జున్ ఖర్గే, పలువురు కేంద్రమంత్రులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ కు పరిశ్రమల అధినేతలు, ఒన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యారంగాల ప్రముఖులు, విదేశీ రాయబారులు, వివిధ రంగాల నిష్ణాతులు హాజరుకానున్నారు. సదస్సులో పాల్గొనాలని 4800 మందికి రాష్ట్రప్రభుత్వం ఆహ్వానం అందజేసింది. సదస్సుకు 2 వేలమందికిపైగా అతిథులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల రాక దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.