calender_icon.png 11 February, 2026 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం

11-02-2026 01:42:20 AM

మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో, రాజకీయ పార్టీలలోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సుమారు వారం రోజుల పాటు ముమ్మరంగా చేసిన ప్రచారం ఎంత వరకు ఫలించింది. ఓటర్లు ఎవరికి అనుకూలంగా వ్యవహారిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ సర్వేలు చేయించగా.. చివరి రోజున ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

  1. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో తరలిన ఎన్నికల సిబ్బంది

ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెకర్లు, ఎస్పీలు

పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్

ఆదిలాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్/మంచిర్యాల/నిర్మల్/భైంసా, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి):  మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కు సర్వం సిద్దమైంది. జిల్లాలోని ఏకైక ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం జిల్లా అధికా ర యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేపట్టింది.   మంగళవారం పంపిణి కేంద్రాల నుం చి పోలింగ్ సామాగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పంపిణీ ప్రక్రియను కలెక్టర్ రాజర్షిషా, బందోబస్తును ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. 

49వార్డుల్లో 314 మంది పోటీ...

ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డులకుగాను రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు మొత్తం 314 మంది పోటీ పడుతున్నారు. 1,43, 951 మంది ఓటర్లు ఉన్నారు.  ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1000 మంది పోలీస్ సిబ్బంది తో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సిబ్బందితో సమీక్షించి పలు సూచనలు చేశారు. 

అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్

మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మాకంగా తీసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఎవరికి వారు గెలుపొటాములపై లెక్కలు వేసుకుంటున్నారు. ఓటరు నాడిపై సొంతంగా సర్వేలు సైతం చేయించారు. కాని కొన్ని సందర్భాల్లో అంతుచిక్కని ఓటరు నాడి ఎవరికి అనుకూలంగా మారుతుంది.. ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఆసిఫాబాద్ జిల్లా 50 వార్డులు, 113 పోలింగ్ కేంద్రాలు

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మంగళవారం ఎన్నికల సామాగ్రితో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బుధవారం జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కె. హరిత నేతృత్వంలో ఎన్నికల అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ అందించడంతో పాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 28 పోలింగ్ కేంద్రాలు, కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు 85 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 102 ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. మొత్తం 147 మంది పోలింగ్ అధికారులను, 151 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులను నియమించగా, వీరితో పాటు 289 మంది ఇతర సిబ్బం దిని కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఎస్పీ నితికా పంత్ తెలిపారు.  ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కె.హరిత కోరారు. బుధవారం జరగనున్న ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనుకాకుండా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 

మంచిర్యాల జిల్లాలో 149 వార్డులకు 444 పోలింగ్ కేంద్రాలు

మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాత నపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బందిని ఒక బృందానికి ఒక పీఓ, ఒక ఏపీఓ, ముగ్గురు ఓపీఓల చొప్పున బెల్లంపల్లి మున్సిపాలిటీకి 68బృందాలు,

చెన్నూరు మున్సిపాలిటీకి 36 బృం దాలు, క్యాతనపల్లి మున్సిపాలిటీకి 45 బృందాలు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి 30 బృం దాలు, మంచిర్యాల నగరపాలక సంస్థకు 265 బృందాలను ర్యాండమైజేషన్ పూర్తి చేసి ఇలా 149 వార్డుల్లోని 444 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని నియమించారు. మంగళ వారం మధ్యాహ్నం నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల నుంచి సిబ్బంది ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు.

మున్సిపల్ ఎన్నికలకు జిల్లాలో కేటాయించిన 444 పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది మంగళ వారం సామాగ్రితో కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 265 పోలింగ్ కేంద్రాలకు హాజీపూర్ మండలంలోని ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయగా బెల్లంపల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,

చెన్నూర్ మున్సిపాలిటీకి అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, క్యాతనపల్లి మున్సిపాలిటీకి సూపర్ బజార్ ఏరియాలోని ఆర్ కె సిఓఏ క్లబ్, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి పాత ఎంపీడీవో కార్యాలయం నుంచి సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. సామాగ్రి పంపిణీని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవోలు, ఎన్నికల అధికారులు పరిశీలించా రు.

మంచిర్యాల జిల్లా పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట మున్సి పాలిటీల పరిధిలోని 89 వార్డుల పరిధిలోని 128 పోలింగ్ లొకేషన్లలో 444 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. 179 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక నిఘాతో పాటు పెట్రోలింగ్ నిర్వహించనున్నా రు. 

మంచిర్యాల జిల్లాల మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖతో పాటు అటవీ, ఆబ్కారీ శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

నిర్మల్ జిల్లాలో 80 వార్డులకు 244 పోలింగ్ కేంద్రాలు

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ బైంసా మున్సిపాలిటీలో బుధవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లాలోని 244 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,67,018 ఓటర్లు ఉన్నారు.

మూడు మున్సిపాలిలో కాంగ్రెస్ బిజెపి, బీఆర్‌ఎస్, ఎంఐఎం బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 385 మంది పోటీ చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని మున్సిపాలిటీలోని 80 వార్డులో ఎన్నికల స్లిప్పులను పంపిణీ చేశారు. 1464 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. వీరంతా పట్టణంలోని ఆయా వీధుల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో మంగళవార సాయంత్రం తరలి వెళ్లారు.  బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

మంగళవారం నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించి పోలీస్ సిబ్బంది ఎన్నికల నియమావళి పాటించాలన్నారు ప్రజాస్వామ్య యుక్తంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ భైంసా సబ్ కలెక్టర్ సాంకేతి కుమార్ ఆర్డిఓ రత్నా కళ్యాణి ఎన్నికల సిబ్బంది ఉన్నారు. 

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. 

నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీలకు జరగనున్న మున్సిపల్ ఎన్నికలల్లో  సమసాత్మక కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ జానకీ శర్మిల మంగళవారం తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా సమసాత్మక పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తామని,  రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను అధికమిస్తే చర్యలు తప్పమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

సోషల్ మీడియాలో అసత్యం ప్రచారాలు చేసిన ఓటర్లను రెచ్చగొట్టిన ప్రలోభాలకు గురిచేసిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పతనపు ఎస్పీలు ఉపేందర్ రెడ్డి రాజేష్ మీనా సాయికిరణ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. మంగళవారం బైంసా పట్టణంలో సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలు రూట్ మ్యాప్ లను పరిశీలించా రు. ఎన్నికలు ముగిసే వరకు ఎదురు నిర్వహించే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉం డాలని పేర్కొన్నారు.