11-02-2026 02:00:13 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) 2026 ఫలితాలను మంగళవారం రాత్రి ప్రకటించారు. రెండు పేపర్లు కలిపి మొత్తం 51.37 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,95,181 మంది పరీక్షకు హాజరైతే అందులో 65,605 మంది ఇన్‌సర్వీస్ టీచర్లుండగా, నిరుద్యోగ అభ్యర్థులు 1,29,576 మంది ఉన్నారు. వీటిలో అర్హత సాధించిన వారు ఇన్‌సర్వీస్ టీచర్లు 37,893 (57.76 శాతం) మంది కాగా, నిరుద్యోగ అభ్యర్థులు 62,377 (48.14 శాతం) మంది ఉన్నారు.
పేపర్1లో మొత్తం 72 శాతం మంది, పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్‌లో 42.37 శాతం, సోషల్ స్టడీస్‌పేపర్‌లో 35.86 శాతం మంది అర్హత సాధించారు. నిరుద్యోగ అభ్యర్థుల కంటే ఇన్‌సర్వీస్ టీచర్లే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో టెట్ ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసి టెట్ ఫలితాలను చూసు కోవాలని టెట్ కన్వీనర్ తెలిపారు. వెబ్‌సైట్‌లో తుది కీని కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ప్రకటించి తీసేశారు...
అధికారులు తొలుత ప్రకటించి ఆతర్వాత తీసేశారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వెబ్‌సైట్‌లో టెట్ ఫలితాలను అప్‌లోడ్ చేశారు. సుమారు గంట సమ య ం వరకు వీటిని ఉంచారు. కొంత మంది అభ్యర్థులు ఫలితాలను చూసుకుని డౌన్‌లో డ్ కూడా చేసుకున్నారు. దాదాపు 10 శాతం మంది అప్పటికే ఫలితాలు చూసుకున్నారు. ఫలితాలు వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే అయ్యాయ ని తెలుసుకున్న అధికారులు వాటిని వెం టనే తొలగించారు. అయితే ఇదంతా సాం కేతిక సమస్యలు తలెత్తడంతోనే జరిగిందని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.