చెంచు మహిళకు మాజీ మంత్రుల పరామర్శ
23-06-2024 12:05 AM
మహేశ్వరం, జూన్ 22 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా మొలచింతపల్లి గ్రామంలో జరిగిన పాశవిక ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ తరఫున బాధితురాలికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందించారు.






