30 June, 2026 | 11:56 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

విభిన్న రంగాల్లో మహిళలకు చక్కటి ఆదాయ మార్గాలు

07-02-2026 12:39 AM
  1. కాకినాడలో కరీంనగర్ మహిళలకు అలంకరణ చేపల పెంపకం పై శిక్షణ

అభినందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): మహిళలు విభిన్న రంగాల్లో ఉపాధి మార్గాలను ఎం చుకుని ఆర్థిక సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా మత్స్యశాఖ సహకారంతో కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 19 మంది సభ్యులు అలంకరణ చేపల పెంపకం, ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో గల రా ష్ట్ర ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో మూడు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని క్యాంపు కార్యాలయంలో కలిసి స్వయంగా తయారు చేసిన అక్వేరియం, అలంకరణ చేపను అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలు కొన్ని రంగాలను మాత్రమే ఉపాధి మార్గాలుగా ఎంచుకుంటున్నారని, దీనివల్ల పోటీ ఎక్కువగా ఉంటుందని అన్నారు. విభిన్న రంగాల్లో చక్కటి ఉపాధి, ఆదాయ మార్గాలు ఎన్నో ఉ న్నాయని తెలిపారు.

అలంకరణ చేపల ఉత్పత్తి, పెంపకంలో మంచి డిమాండ్ ఉన్నందున కరీంనగర్ జిల్లా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులను ఆంధ్రప్రదేశ్లోని కాకినా డలో శిక్షణకు పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ భార తి, ఫీల్ ఆఫీసర్ అశోక్, ఎఫ్.డి.ఓ మంజుల పాల్గొన్నారు.