16 April, 2026 | 10:17 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

భీమేశ్వరాలయంలో రెండు రోజుల హుండీ ఆదాయం రూ.2.74 కోట్లు

07-02-2026 12:37 AM

వేములవాడ,ఫిబ్రవరి  6,(విజయక్రాంతి)శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ భీమేశ్వరాలయంలో శుక్రవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో భక్తుల నుండి భారీగా కానుకలు లభించాయి. రెండు రోజుల హుండీ ఆదాయం కలిపి రూ.2,74,62,765 నమోదు అయి నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.మొదటి రోజు హుండీ ద్వారా రూ.1,72,76,469, రెండవ రోజు రూ.1,01,86,296 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.బంగారం పరంగా మొదటి రోజు 75.300 గ్రాములు, రెండవ రోజు 43.500 గ్రాములు లభించగా మొత్తం 118.800 గ్రాములు నమోదయ్యాయి.

అలాగే వెండి మొదటి రోజు 6 కిలోల 800 గ్రాములు, రెండవ రోజు 4 కిలోల 200 గ్రాములు లభించగా మొత్తం 11 కిలోలుగా నమోదైంది.హుండీ లెక్కింపులో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి ఆధ్వర్యంలో ఏసీ కార్యాలయ పరిశీలకు లు రాజమౌళి, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ అర్చకులు,సిబ్బంది పాల్గొన్నారు.భద్రతా ఏర్పాట్లను ఎస్పీఎఫ్, హోమ్ గార్డ్ సిబ్బంది పర్యవేక్షించగా, ఆలయ సిబ్బంది తో పాటు రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు హుండీ వెంపకంలో పాల్గొన్నారు.