29 June, 2026 | 8:02 PM

పాన్ లింక్ చేయకపోతే అధిక టీడీఎస్

29-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 28: ఆధార్‌తో పాన్‌ను 2024 మే 31నాటికల్లా లింక్ చేసుకోవాలని పన్ను చెల్లింపుదార్లను ఆదాయపు పన్ను శాఖ కోరింది. ఆ తేదీనాటికి లింక్ కాకపోతే అధిక టాక్స్ డిడెక్టడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) లేదా టాక్స్ కలెక్టడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పడుతుందని హెచ్చరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో మంగళవారం ఆదాయపు పన్ను శాఖ ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఆధార్‌తో లింక్‌కాకపోతే పాన్ పనిచేయదని, ఇన్‌ఆపరేటింగ్ పాన్ ఉన్నవారికి టీడీఎస్ లేదా టీసీఎస్ కోత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనల మేరకు టీడీఎస్/టీసీఎస్ సాధారణంగా వర్తించే రేటుకంటే రెట్టింపు మొత్తాన్ని డిడెక్టర్స్/కలెక్టర్స్ ( పన్ను మినహాయించి మిగిలిన ఆదాయాన్ని చెల్లించేవారు) కట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పాన్ లింక్ చేసుకోవాలంటే ఐటీ శాఖకు రూ.1,000 ఫైన్ చెల్లించాలి.