18 June, 2026 | 1:42 AM

కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు

18-06-2026 12:00 AM

భారీగా విదేశీ మద్యం బాటిళ్లు పట్టివేత

జవహర్‌నగర్, జూన్ 17: జవహర్నగర్లోని ఓ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఖరీదైన సుమారు 500 వరకు విదేశీ మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన జవహర్ నగర్ బాలాజీనగర్ లో చోటుచేసుకుంది.

మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్ బాలాజీనగర్ లో నివాసముండే ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు, అతని సోదరుడు విదేశాల నుంచి మద్యం బాటిళ్ళను నిబంధనలకు విరుద్ధంగా తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు బుధవారం సోదాలు చేశారు.

సుమారు 500 వరకు విదేశీ, ఆర్మీ బాటీళ్ళను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ మార్గంలో మద్యం బాటిళ్ళను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న నిందితులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. కాంగ్రెస్ నేతతో పాటు మరో పాయి చెందిన సోదరుడి ఇంట్లో కూడా దాడులు చేశారని సమాచారం. ఈ ఘటనపై మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ను ఫోన్లో సంప్రదించగ స్పందించలేదు.