18 June, 2026 | 1:57 AM

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల సాకారం

18-06-2026 12:00 AM

పామేన భీమ్ భరత్

మొయినాబాద్, జూన్ 1౭ (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల సాకారమైందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, ఎలకగూడ, కుతు బుద్దీన్గూడ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ.. కాంగ్రె స్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చే శారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ని ప్రతి నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నా రు. నిరుపేద కుటుంబాలకు భరోసాగా నిలుస్తూ, వారి సొంతింటి కలను నెరవేర్చుతున్నారని ఆయన చెప్పారు. పేదల కోసం గృహ వసతి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన కొనియాడారు.

పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాన య్య, వైస్ ప్రెసిడెంట్ మర్రి రవీందర్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, జయరామ్ రెడ్డి, నిరంజన్ గౌడ్, కేబుల్ రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, చిలుకూరు రాజు, మాజీ ఎంపీటీసీ గణేష్ గౌడ్, విఠల్ యాదవ్, మినాజొద్దీన్, జంగయ్య, రామారావు, సాదిక్ పాల్గొన్నారు. వీరితో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు హాజరయ్యారు.