18 June, 2026 | 2:47 AM

విద్యాసమస్యలపై చర్చించిన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ప్రతినిధులు

18-06-2026 01:38 AM

జిల్లా విద్యాశాఖ అధికారికి సన్మానం

కామారెడ్డి, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్  కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన నూతనంగా జిల్లా విద్యాశాఖ అధికారి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన  మల్లికార్జున్ గారిని జిల్లా శాఖ పక్షాన బుధవారం సన్మానించారు. అనంతరం డి ఈ ఓ తో పలు విషయాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో పండిత పరిషత్  జిల్లా అధ్యక్షులు నార్ల అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, రాష్ట్ర నాయకులు మంత్రి మధుసూదన్, గఫూర్ శిక్షక్, వంశీధర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ లాల్ సింగ్, డివిజన్ అధ్యక్షులు సుదర్శన్, డివిజన్ కార్యదర్శి ఎడ్ల రాజయ్య, డివిజన్ సభ్యులు చంద్రశేఖర్, పుల్యానాయక్, మొహమ్మద్ రఫీ,ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.