calender_icon.png 16 July, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సి గ్రేడ్ ఆపరేటర్ పదోన్నతుల సర్క్యులర్ విడుదల పట్ల హర్షం

16-07-2025 12:22:20 AM

కృతజ్ఞతలు తెలిపిన టీబీజీకే ఎస్  వైస్ ప్రసిడెంట్ నాగెల్లి

మణుగూరు, జులై 15( విజయ క్రాంతి) : ఏరియా నందు ఖాళీగా ఉన్న115 సి గ్రేడ్ ఆపరేటర్ పదో న్నతులను భర్తీ చేసేందుకు యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయడం, దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 25 లోపు గడువు ప్రకటించడం పట్ల ఏరియా  టీబీజీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం  ఆయన మాట్లాడుతూ ఆపరేటర్ల ఉజ్వల భవిష్యత్తుకు  యాజ మాన్యం బంగారు బాటలు వేయడం అభినందనీయమన్నారు.

ఆపరేటర్లు శ్రమను గుర్తించి, యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాల సాధనకు చురుకుగా అడుగులు  పడతాయని తెలిపారు. ఆపరేటర్  ఖాళీలను భర్తీ చేయాలని తమ సంఘం చేసిన విజ్ఞప్తితో యాజమా న్యం స్పందించి నేడు 115 ఖాళీ లను గుర్తించి, సర్క్యు లర్ విడు దల చేయడం జరిగిందనిపేర్కొన్నారు.యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఇజ్రాయిల్, మునిగేల నాగే శ్వర రావు, రామాచారి, మస్తాన్ పాల్గొన్నారు.