calender_icon.png 16 July, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే కింద భవిత, విద్యా వనరుల కార్యాలయాలు భవనం లేని విద్యా శాఖ

16-07-2025 12:24:27 AM

అశ్వారావుపేట, జూలై,15 (విజయ క్రాంతి) : అశ్వారావుపేట మండల విద్యాశాఖ కు సొంత భవనం లేదు. వేరే శాఖ పంచన  మండల విద్యా అధికారి, కార్యాలయ సిబ్బంది గత ఐదు సంవత్సరాలు గా విధులు నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట  మండల విద్యాశాఖకు  అప్పటి రాష్ట్ర ప్ర భుత్వం 1999 లో విద్యా శాఖకు ప్రత్యేకంగా భవనం నిర్మించారు.

15 ఏళ్లు పాటు భవనం బా గానే ఉన్నా, ఆ తరవాత గోడలు బీటలు బారి, స్లాబు లీకులు అవుతూ కార్యాలయ రికార్డులు తడవటమే కాకుండా, స్లాబ్ పెచ్చులు  ఊడి ఎపుడు మీద పడతాయో అనే భయంతో విధులు నిర్వహించేవారు.2020 సంవత్సరం లో చిన్నారులు కోసం నిర్మించిన భవిత కార్యాలయం లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

భవిత కార్యాలం లోనే విద్యాశాఖ కూడా ఉండటం తో పాటు ఉపాధ్యాయులు అనేక పనులు మీద కార్యాలయానికి రాకపోకలు సాగిస్తూ ఉండటం, రద్దీగా మారింది. దింతో భవిత లో చిన్నారుల కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి  శిథిలావస్థకు చేరిన విద్యా శాఖ భవనాన్ని తొలిగించి నూతన భవనాన్ని  నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.