calender_icon.png 16 July, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోశాల పంచాయితీ కొలిక్కి!

16-07-2025 12:22:20 AM

- అగ్రిమెంట్ ఇష్యూ వెలుగులోకి రావడంతో అడ్డం తిరిగిన కథ

- 300 గజాలు తీసుకునేందుకు అంగీకరించిన కొందరు రైతులు

- 25 మందికి ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే యాదయ్య

- ఇదే సమయంలో హైవేపై ధర్నాకు యత్నించిన మిగితా రైతులు

-స్టేషన్‌కు తరలించిన పోలీసులు

చేవెళ్ల, జూలై 15: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కెపల్లిలో ఏర్పాటు చే స్తున్న గోశాల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్ 180లోని 99.14 ఎకరాలకు సంబంధించి రైతులు 40 రోజులుగా పోరాటం చేస్తున్నా.. ‘అగ్రిమెంట్’ వ్య వహారం వెలుగులోకి రావడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో చేసేది లేక కొందరు రైతు లు సర్కారు ప్రతిపాదించిన ‘ఎకరాకు 300 గజాలు’ తీసుకునేందుకు అంగీకరించారు.

ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్ కుమార్తో కలిసి 9 కుటుంబాలకు చెందిన 25 మంది రైతులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 300 స్థలంతో పా టు ఇందిరమ్మ ఇల్లు, గోశాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇదే సమయంలో మిగితా రైతులు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బీజాపూర్ హైవేపై ధ ర్నాకు యత్నించారు. సర్కారుకు వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ.. తమకు న్యాయం చే యాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని స్టేష న్ కు తరలించారు. 

40 రోజులుగా పోరాటం

 ప్రభుత్వం ఈ భూమిని గోశాలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి 43 కు టుంబాలకు చెందిన రైతులు 40 రోజులుగా పోరాటం చేస్తున్నారు. వీరికి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు వామపక్ష పార్టీల నేత లు కూడా మద్దతు ఇచ్చారు. రైతులను మో సం చేస్తే ఊరుకునేది లేదని, న్యాయం జరిగే వరకు తమ పార్టీలు అండగా ఉంటాయని హామీలు ఇచ్చారు. ఈ పోరాట ఫలితంతోనే ముందు ఎకరాకు 200 గజాలు మాత్రమే ఇస్తానన్న ప్రభుత్వం తర్వాత 250 గజాలు... ఫైనల్ గా 300 గజాలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయినప్పటికీ తమకు 2013 భూసే కరణ చట్టం ప్రకారం పరిహారం లేదా ఎకరాకు 1000 గజాలు ఇవ్వాల్సిందేనని 10 రోజులుగా రిలే దీక్షలు కూడా చేపట్టారు. ఈ దీక్షలకు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఈటల రాజేందర్ సంఘీభావం కూడా తెలిపారు. ఇంత వరకు బాగానే ఉన్నా గ్రా మానికి చెందిన డప్పు రమేశ్ అగ్రిమెంట్ వ్యవహారం వెలుగులోకి రావడంతో రైతులు కంగు తిన్నారు. 

  ఎలా బయటపడిందంటే?

 180 సర్వే నెంబర్ కు సంబంధించి గ్రా మానికి చెందిన డప్పు రమేశ్ .. ఆయనతో సహా 46 మంది రైతులు 20 ఏళ్ల నుంచి పొ జిషన్లో ఉన్నట్లుగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. దీని ఆధారంగా డప్పు రమేశ్.. మిగి తా 45 మంది నుంచి ఏజీపీ తీసుకున్నట్లు మరో పత్రం క్రియేట్ చేశాడు. వీటి ఆధారంగా భూమిని హైదరాబాద్ కు చెందిన బి .లింగారెడ్డితో పాటు మరో ఇద్దరికి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. 2019 ఫిబ్రవరి 11, అక్టోబర్ 4 తేదీల్లో వారితో ఒప్పందాలు చేసుకుని.. మూడు దశల్లో రూ.1.5 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నాడు.

కానీ, గడువు ముగిసినా... రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇటీవల ఈ భూములను ప్రభుత్వం గోశాల కేటాయించిందని మీడియాలో రావడంతో అగ్రి మెంట్ చేసుకున్న వ్యక్తులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా.. ఆ భూములు పూర్తి గా ప్రభుత్వానికి చెందినవని చెప్పారు. ఎ లాంటి పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయలేదని స్పష్టం చేశారు. దీంతో పోర్టరీ డాక్యుమెంట్లతో డప్పు రమేశ్ తమను మోసం చేశాడని బి.లింగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారం లో డప్పు రమేశ్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. తెర వెనుక మరింత మంది నేతలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.  

ముందుకొస్తున్న రైతులు

9 కుటుంబాలకు చెందిన 25 మందికి 300 గజాలకు సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేశాం. మరో 32 కుటుంబాలు ఉం డగా.. చాలా మంది రైతులు ప్రొసీడింగ్స్ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. స్థలా లు కూడా హెచ్ ఎండీఏ మాదిరిగా లే అవు ట్ చేసి రైతులకు అలాట్ చేస్తాం.  గోశాలలో ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం. 

గౌతమ్ కుమార్, తహసీల్దార్