3 May, 2026 | 7:10 AM

ఉత్సాహంగా మ్యూజికల్ నైట్

10-12-2024 12:37 AM
  1. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ప్రజాపాలన వేడుకలు
  2. తమన్ పాటలకు స్టెప్పులేసిన ప్రజాప్రతినిధులు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలనా ప్రజా విజయోత్సవాల సంబురాలు అంబురాన్ని అంటాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఆకట్టుకుంది.

గాయకులు శ్రీకృష్ణ, జయరాంతో కలిసి తమన్ చేపట్టిన షో ప్రేక్షకులను అలరించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీహాజరై మ్యూజికల్ ప్రోగ్రాంను ఎంజాయ్ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి బుట్టబొమ్మ సాంగ్‌కు డ్యాన్స్ వేసి ఉత్సాహపరిచారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తదితరులు సంగీత దర్శకుడు తమన్‌ను ఘనంగా సత్కరించారు.