బంద్ పాటించని వ్యాపార వర్గాలు
10-12-2024 12:34 AM
ములుగు(జనగామ), డిసెంబర్ 9 (విజయక్రాంతి): మావోయిస్టుల కం చుకోటగా పేరొందిన ములుగు జిల్లా లో వారికి ఆదరణ కరువైంది. ఇటీవల పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందడం తో.. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కాల్పులను నిరసిస్తూ సోమవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ బంద్‌ను రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదు. ములుగు ఈ ప్రాంతంలో నూ బంద్ ప్రభావం కనిపించకపోవ డం గమనార్హం. మావోల ప్రభావం ఎక్కువగా ఉండే మంగపేట, కమలాపూర్, నర్సింహసాగర్, రాజపేట ప్రాం తాల్లో షాపులు, వ్యాపార సముదాయాలు, ఇతర కార్యక్రమాలన్నీ సోమ వారం యథాతథంగా నడిచాయి.






