రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
10-12-2024 12:37 AM
కామారెడ్డి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పొందూర్తి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పొందుర్తికి చెందిన మహ్మద్ ఆరిఫ్(33) బైక్‌లో పెట్రోల్ పోసుకునేందుకు ఆదివారం రాత్రి బైక్‌పై పొందూర్తి చౌరస్తాలోని హెచ్‌పి పెట్రోల్‌బంక్‌కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా హైదారాబాద్ నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆరిఫ్ మృతిచెందాడు. మృతుని భార్య సోని ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






