calender_icon.png 18 February, 2026 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన కుస్తీ పోటీలు

18-02-2026 01:22:14 AM

భైంసా, ఫిబ్రవరి ౧౭ (విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓల గ్రామంలో మంగళవారం అంతరాష్ట్ర కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లయోధులు తరలివచ్చి పోటీలో పాల్గొన్నారు.

ఈ పోటీలను గ్రామ సర్పంచ్ కట్ట రవి ముఖ్య నాయకులు నాలం శ్రీనివాస్ దత్తాద్రి శివకుమార్ భోజన్న ఆధ్వర్యంలో గెలుపొందిన మల్ల యోధులకు బహుమతులను అందజేశారు. అంతకుముందు ఆలయంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కుస్తీ పోటీల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.