18-02-2026 01:22:33 AM
ఖమ్మం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తొలి అడుగులోనే స్టెమ్ స్పార్క్ విద్యార్ధులు విజయ దుందుభి మోగించారు. స్థానిక శ్రీనగర్ కాలనిలోని స్టెమ్స్పార్క్ జూనియర్ కాలేజ్ విద్యార్ధులు జె.ఈ.ఈ. మెయిన్స్ ఫలితాలలో అద్బుతమైన ప్రతిభతో అత్యధిక పర్సంటైల్ సాధించారు. స్టెమ్స్పార్క్ జూనియర్ కాలేజ్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే జె.ఈ.ఈ. మెయిన్స్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే పవన్సాయి వెంకట్ 97.80 పర్సంటైల్ సాధించి విజయఢంకా మ్రోగించడం జరిగింది.
97.80 పర్సంటైల్తో పాటు, జ్ఞానశ్రీ (95), నాగ కార్తికేయ (93) మరియు తరుణ్సాయి (91) పర్సంటైల్తో పాటు మరెంతో మంది విద్యార్ధులు అత్యధిక పర్సంటైల్స్ సాధించడం జరిగింది. ఈ సందర్బంగా స్టెమ్స్పార్క్ కాలేజ్ డైరెక్టర్ కొండా శ్రీధర్రావు.. అత్యధిక పర్సంటైల్స్ సాధించిన విద్యార్ధులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధుల ఉజ్జ్వల భవిష్యత్కు వారి లక్ష్యాలను సాధించడానికి స్టెమ్స్పార్క్ కాలేజ్ ఒక వారధిగా ఉంటుందన్నారు.
జె.ఈ.ఈ. మెయిన్స్, అడ్వాన్స్ మరియు ఎంసెట్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షలలో విజయాలను సాధించి ఐ.ఐ.టి., యన్.ఐ.టి మరియు ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కాలేజీలలో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా తక్కువ మంది విద్యార్ధులతో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీని సమకూర్చి నిరంతర పర్యవేక్షణతో అత్యద్బుతమైన ఫలితాల సాధనకు కృషి చేస్తున్నామని తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్ధులను అభినందించినారు.