3 August, 2026 | 10:04 PM

బుంగ బడిన బస్టాండ్ ను విజిట్ చేసిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీకాంత్

03-08-2026 08:57 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్టీసీ కొత్త బస్టాండ్ ను కరీంనగర్ జోన్ ఆర్టీసీ సివిల్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీకాంత్ విజిట్ చేశారు. గత నెల 31న బెల్లంపల్లి బస్టాండ్ లో భారీ బుంగ పడిన సంఘటన తెలిసిందే. ఆదివారం ఈ బుంగను అధికారులు పూడ్చివేశారు. ఈ నేపథ్యంలో బస్టాండ్ లో ఏర్పడిన బుంగను  సదరు అధికారి వచ్చి పరిశీలించారు. అదేవిదంగా బస్టాండ్ లో నెలకొన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి  బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ఆయన కు వివరించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్  దవ స్వాతి మాట్లాడుతూ... బెల్లంపల్లి బస్టాండుకు ఎదురుగా రహదారి నేర్పించాలన్నారు. బస్టాండ్ లోని మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగా చూడాలని తెలిపారు. అదేవిధంగా ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం అందేలా చూడాలని కోరారు. బుంగ బడిన ప్రాంతంలో మరమ్మతులు చేపించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్ కు నూతనంగా రంగులు వేయించాలనిలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చింతల వసంత , నాయకులు నీలి కృష్ణ, పీక లక్ష్మణ్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు..