calender_icon.png 30 September, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

30-09-2025 06:06:53 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన, వ్యాధులు పెరిగాయని.. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నగరంలోని రెనె హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఈసీజీ, 2డి ఏకో, స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు.

కార్డియాక్ అరెస్టులపై, సీపీఆర్ చేయడంపై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు 40 నిమిషాల పాటు వ్యాయామం లేదా నడక అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గుండె పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 140 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు. శిబిరం ఏర్పాటు చేసినందుకు రెనె హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటె డెంట్  వీరారెడ్డి, ఆర్ఎంవోలు నవీన, సుధాకర్, వైద్యులు ఉదయ్ ఆదిత్య, రెనె హాస్పిటల్ వైద్యులు  తదితరులు పాల్గొన్నారు.