calender_icon.png 30 September, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడవాడల "పూలవనం"..

30-09-2025 06:10:11 PM

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

ఉత్సాహంగా ఆడి పాడిన మహిళలు

పాపన్నపేట (విజయక్రాంతి): చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ మహిళలు సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తంగేడు, గునుగు, టేకు, బంతి, తీరొక్క పువ్వులతో సుందరంగా తయారు చేసిన బతుకమ్మలతో మహిళలు పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. పాడి, పశు సంపద వృద్ధి చెంది ఆర్థిక అభివృద్ధిని సాధించాలని, పిల్లా పాపలని చల్లంగా చూడమ్మా.. గౌరమ్మ తల్లి అంటూ.. వేడుకున్నారు. తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. వెళ్లి.. మళ్లీ రావే గౌరమ్మ తల్లి.. అంటూ స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి వేడుకున్నారు.