calender_icon.png 30 September, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల జన్మదిన వేడుకలు

30-09-2025 06:03:35 PM

చిగురుమామిడి (విజయక్రాంతి): హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అంజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం బస్టాండ్ వద్ద బస్సులలో ప్రయాణికులకు సీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.