10 August, 2026 | 4:45 PM

ప్రతి ఒక్కరూ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలి

10-08-2026 03:37 PM

బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో హర్,ఘర్ తిరంగాలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ బాన్సువాడ కార్యాలయం పైన సోమవారం బిజెపి నాయకులు జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటి చెప్పాలని, విద్యార్థుల్లో యువకుల్లో దేశభక్తి పెంపొందించుటకై ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు అని ఆయన తెలిపారు.

ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎదురవేయాలని మన దేశం మన జెండా మన గర్వం.ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేదం దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి జిల్లా కౌన్సిల్ నెంబర్  శివ ప్రసాద్, జిల్లా ధార్మిక సెల్ జెయింట్ కన్వీనర్ కులకర్ణి శ్రీనివాస్ రావు బిజెపి నాయకులు పాశం భాస్కర్ రెడ్డి గోస్కే పురుషోత్తం హెచ్ లక్ష్మణ్  ప్రదీప్  సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.