08-02-2026 01:23:02 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి శనివారం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు. నగరంలోని గుపాన్‌పల్లి బైపాస్ రోడ్డు లో గల రూరల్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. సిరికొండ మండలం దుప్య తండాకు చెందిన మాలవత్ రమేష్ 10 నెలల క్రితం తన పొలంలో పనిచేస్తుండగా పొలంలో కరెంట్ షాక్ తగిలి మరణించాడు. ఎమ్మెల్యే భూపాతిరెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ద్వారా అతని భార్య మాలవత్ నీలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించారు. ఆ చెక్కును శనివారం నీలాకు అందజేశారు. కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్, దుప్య తండా సర్పంచ్ చందర్ నాయ క్ పాల్గొన్నారు.