25 February, 2026 | 9:41 PM

నేడే కొలువుదీరినన్న ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం

25-02-2026 07:50 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం గురువారం పదవీ బాధ్యతలు చేపట్టమన్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి లతోపాటు 34 మంది కౌన్సిలర్లు పదవీ బాధ్యతలు శ్వీకారించనున్నారు.  సుమారు ఏడాది క్రితం మున్సిపల్ పాలకవర్గం కాలం ముగిసింది. నాటినుండి ఇన్చార్జి అధికారులతో పాలన సాగింది. ఈనెల 11న ఎన్నికలు జరిగగా, 13న ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేశారు. గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

నూతనంగా ఏర్పడిన మున్సిపల్ పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా రోడ్లు, మురికి కాలువలు, చెత్త సేకరణ వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండడంతో ఆయా వార్డుల్లో మురికి గుంటలు ఏర్పడుతున్నాయి. ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధుడు కరువైనారు. సిబ్బంది సమస్యను తీర్చాల్సిన అవసరం కొత్త చైర్పర్సన్ పై ఉంది. ఇదిలా ఉంటే గతంలో చైర్ పర్సన్ గా పనిచేసిన గత పాలకవర్గాలపై అవినీతి మరకలు అంటుకున్నాయి. వారికి దీటుగా అవినీతి రహిత పాలన సాగిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజకీయంగా అనుభవం లేకపోవడంతో పాలన ఎలా సాగిస్తారని చర్చ జరుగుతోంది.