25 February, 2026 | 9:19 PM

కిచెన్ షెడ్డు, బాత్రూం నిర్మాణానికి భూమి పూజ

25-02-2026 07:53 PM

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలంలోని దేవాపూర్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ పోరన్ల సంతోశ్, ఉప సర్పంచ్ మేకల శ్రీరాములు పేర్కొన్నారు. బుధవారం ఉన్నత పాఠశాలలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న కిచెన్ షెడ్, బాత్రూం పనులను భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం నర్సయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, జలందర్ యాదవ్, నారాయణ, నాయిని నవీన్, చింతల రాజన్న, పాశపు అజయ్ తదితరులు ఉన్నారు.