బాధితులకు సత్వర న్యాయం
09-04-2026 12:00 AM
బైంసా, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశించారు. బుధవారం బైంసా క్యాంపు కార్యాలయంలో ఆమె గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 13 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి ఫిర్యాదులపై స్పందించారు.
ఫిర్యాదు దారుల ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. కొన్ని కుటుంబ సమస్యలపై కౌన్సిలింగ్ నిర్వహించారు.




