9 April, 2026 | 2:45 AM

‘గట్టుమల్ల’లో ఉచిత పశువైద్య శిబిరం

09-04-2026 12:00 AM

ఐసీఏఆర్ ఎన్‌ఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): జాతీయ మాంస పరిశోధన సంస్థ(ఐసీఏఆర్ ఎన్‌ఎంఆర్‌ఐ హైదరాబాద్) వారి ఆర్థిక సౌజన్యంతో బుధవారం గట్టు మల్ల అయితవేదికలో ఉచిత మెగా పశువైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ద్వారా క్రాంతి నగర్ గంగమ్మ కాలనీ గట్టు మల్ల గ్రామాల్లోని పాడి రైతులు జీవాలను పెంపకదారులు, కోళ్ల పెంపకందారులకు, రైతులకు వారి పశువులను ఆరోగ్య పరీక్షలు చేసి వాటికున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన మందులను ఉచితంగా అందజేశారు.

అదేవిధంగా గట్టు మల్ల గ్రామంలోని జీవాలకు నట్టల మందు వేశారు.ఈ సందర్భంగా గట్టు మల్ల గ్రామ సర్పంచ్ బట్టు.కనకరాజు మాట్లాడుతూ ఇటువంటి పశు వైద్య ఆరోగ్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరంలో డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి పాల్గొని మాట్లాడారు. ఐసీఏఆర్ ఎన్‌ఎంఆర్‌ఐ హైదరాబాద్ వారి సహాయ సహకారాలతో ఇంత చక్కటి పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

ఈ ఆరోగ్య శిబిరం ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో మందులను ఏర్పాటు చేసి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే పశువులు, జీవాలకు చికిత్స అందించనున్నారు. మూడు గ్రామాల రైతు సోదరులు ఉపయోగించవలసిందిగా కోరారు, డాక్టర్ బసవ రెడ్డి  ప్రధాన శాస్త్రవేత్త ఐసీఏఆర్ ఎన్‌ఎంఆర్‌ఐ హైదరాబాద్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం కంటే పాడి పరిశ్రమ, జీవాలను పెంపకం చేపట్టి నైతే వారు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక మండల పశువైద్యాధికారి డాక్టర్ జి ఆనంద్ రావు మాట్లాడుతూ ఇటువంటి ఆరోగ్య శిబిరాలను మరెన్నో గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు వస్తాయన్నారు.

సుమారుగా 538 జీవాలకు,243 పశువులకు నట్టల మందు పంపిణీ, 624 కోళ్లకు సంబంధించిన మందులను,76 సాధారణ పశు వైద్య చికిత్సలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బట్టు కనకరాజు,డాక్టర్ బసవ రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త ఐసీఏఆర్ ఎన్‌ఎంఆర్‌ఐ హైదరాబాద్, డాక్టర్ యోగేష్ శాస్త్రవేత్త, డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి,డాక్టర్ బి మల్లయ్య, సహాయ సంచాలకులు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ కార్యాలయం, డాక్టర్ జి ఆనంద్ రావు మండల పశువైద్యాధికారి, లక్ష్మీదేవి పల్లి మండలం, డాక్టర్ వి సంతోష్ పశువైద్యాధికారి చంద్రుగొండ, డాక్టర్ జి రమేష్ పశువైద్యాధికారి నాగారం, లక్ష్మీదేవి పల్లి పశు వైద్య సిబ్బంది, గట్టు మల్ల క్రాంతి నగర్ గంగమ్మ కాలనీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.