మన చేతుల్లోనే హైందవ ధర్మ పరిరక్షణ
09-04-2026 12:00 AM
కమలానంద భారతి
భైంసా, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): హైందవ భారత దేశంలో ధర్మ పరిరక్షణ మన చేతుల్లోనే ఉందని అది కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని శ్రీశ్రీశ్రీ గన్నవరం పీఠాధిపతి కమలానంద భారతి అన్నారు. బుధవా రం కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో పాల్గొన్నారు.
మొదట హనుమాన్ శివాలయంలో పూజలు నిర్వహించారు. మహిళల కుంకుమార్చన చేశారు. ధర్మ పరిరక్షణ సంస్కృతి పరిరక్షణ, హిందూ బంధువుల ఐక్యతతోని సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ కేశవ్, సర్పంచ్ కట్ట రవి, అధ్యక్షులు గోన వెంకటేష్, నిర్వాకులు పాల్గొన్నారు.




