29 June, 2026 | 11:09 AM

కమ్యూనిజంతోనే దోపిడీ అంతం

13-12-2025 12:00 AM

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు  యల్లావుల రాములు

హుజూర్ నగర్, డిసెంబర్ 12: సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిజం ఆవిర్భవించిందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు అన్నారు.శుక్రవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ సభ్యత్వ నమోదు,ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పెట్టుబడిదారీ వర్గ శ్రమ దోపిడీని కమ్యూనిజం ఎప్పుడు వ్యతిరేకిస్తుందన్నారు.

బిజెపి అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానం కూడా సామాన్య ప్రజలను దోచుకోవడమే అన్నారు. దేశంలో కమ్యూనిజం ఆవిర్భవించి శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకో వాలని పిలుపునిచ్చారు.

ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సిపిఐ భారీ బహిరంగ సభ జనవరి18న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, దేవరంమల్లేశ్వరి, మామిడి వెంకయ్య, సోమగాని కృష్ణ, జడ వెంకన్న, జక్కుల రమేష్,  యల్లావుల ఉమా, చక్రాల స్టాలిన్ పాల్గొన్నారు.