04-07-2025 10:57:14 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో అర్హత లేకుండా వైద్యం నిర్వహిస్తున్న వైద్యశాలను జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్ తనిఖీ చేశారు. చందా శంకర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, అక్కడ రోగులకు అందిస్తున్న చికిత్స విదానాన్ని పరిశీలించగా ఎలాంటి అర్హతలు లేకుండా రోగులకు స్టెరాయిడ్ ఇంజక్షన్లు, యాంటీబాటిక్, సెలైన్ బాటిల్స్ ఇస్తూ చికిత్స చేస్తుండగా డీఎంహెచ్వో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్న పేషంట్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారికి అందించాల్సిన చికిత్సను ఆరోగ్య కేంద్ర వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేసి చందా శంకర్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ ప్రధమ చికిత్స కేంద్ర నిర్వాహకులు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ లు అనిల్ కుమార్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.