21 June, 2026 | 8:34 PM

బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో పోలీసుల విస్తృత తనిఖీలు

20-07-2024 04:50 PM

బెల్లంపల్లి (విజయ క్రాంతి): గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టడంలో భాగంగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలను చేపట్టారు. ఏసీబీ రవికుమార్ నేతృత్వంలో బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్, బెల్లంపల్లి టూ టౌన్, తాళ్ల గురజాల ఎస్సైలు డి .రమేష్, జి. నరేష్ ల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ లోని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నార్కోటిక్ ట్రైనింగ్ స్నీఫర్ డాగ్ తో స్టేషన్ పరిసరాలను, అనుమానాస్పద వస్తువులను పరిశీలించారు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. పార్సిల్ ఆఫీస్, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ ప్రాంతాలను తనిఖీ చేశారు. ఆగి ఉన్న రైళ్లతో పాటు స్టేషన్ పరిధిలోని హోటల్లో కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలను నిర్వహించినట్లు సీఐ అఫ్జలొద్దీన్ తెలిపారు. తనిఖీల్లో జి ఆర్ పి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు