3 July, 2026 | 6:23 PM

Breaking News

అంగన్వాడి పిల్లలకు యూనిఫార్మ్స్ పంపిణీ   •   టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్   •   జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •  

కక్షపూరితంగా కూల్చివేతలు

24-09-2024 02:17 AM

ఎంపీ ఈటల రాజేందర్

కూకట్‌పల్లి,  సెప్టెంబర్ 23: రాష్ట్రప్రభుత్వం నిరుపేదల బతుకులతో ఆడుకుంటున్నదని, కక్షపూరితంగా హైడ్రా ద్వారా కట్టడాలను కూల్చివేస్తున్నదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నా రు. సోమవారం ఆయన ఇటీవల హైడ్రా కట్టడాలను కూల్చివేసిన కూకట్‌పల్లి నల్లచెరువు బాధితులను పరామర్శించి మాట్లాడారు. కూల్చివేతలలో ఎంతోమంది సర్వం కోల్పో యారన్నారు. హైడ్రా అధికారులకు కోర్టులు, చట్టాలపై నమ్మకం లేదని, శని, ఆదివారాల్లో కోర్టులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవనే ఉద్దేశంతోనే కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చెరువులను కాపాడాలనుకుంటే ముందుగా చెరువుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములను లెక్కించాలన్నారు.