19-02-2026 12:15:57 AM
మంగళవారం ప్రియురాలిపై పెట్రోల్ పోసి తానూ నిప్పంటించుకున్న అంజయ్య
విషమంగా వివాహిత పరిస్థితి
మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): తనతో పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తాను కూడా మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డ ప్రియుడు చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరణించాడు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కురవి మండలం మోదుగుల గూడేనికి చెందిన అంజయ్య భార్య రెండేళ్ల క్రితం చనిపోగా, స్థానిక ప్రగతి నగర్ కు చెందిన వివాహితతో సహజీవనం చేయసాగాడు.
ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా వేధిస్తుండడంతో ఆమె అంజయ్య వేధింపులు తట్టుకోలేక పట్ట ణం వీడి మరోచోటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మేడారం సమ్మక్క జాతర సందర్భంగా ఆమె తిరిగి తల్లిగారి ఇంటికి రాగా ఈ విషయం తెలుసుకున్న అంజయ్య ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మంగళవారం వేధిం పులకు గురిచేసి, తనను పెళ్లి చేసుకోకపోతే నిన్ను పెట్రోల్ పో సి నిప్పంటించి చంపేస్తానంటూ ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టా డు. ఈ క్రమంలో ఆమెతో పాటు అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇరువురిని వరంగల్ ఎం జీఎం ఆసుపత్రికి తరలించగా అంజయ్య మరణించాడు. ఆమె ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.