15-11-2025 06:38:33 PM
హైదరాబాద్: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గచ్చిబౌలి పరిధి ఇంద్రనగర్ లోని జీరాక్స్ సెంటర్ లో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, నకిలీ వే బిల్స్, నకిలీ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్, మార్క్స్ మెమోస్, పాన్ కార్డులను సైతం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ సర్టిఫికెట్లు చేయించుకున్నట్లు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ పేర్కొన్నారు.
వారి నుంచి కంప్యూటర్, సీపీయూ, మొబైల్స్, ఫేక్ మెమోలు, థెరపి సర్టిఫికెట్స్, మెడికల్ రిపోర్స్, ఫేక్ హోమ్ గార్డ్ ఐడి కార్డ్స్, జాబ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్స్ పొందిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏసీపీ శ్రీధర్ వెల్లడించారు. గచ్చిబౌలి పరిధిలో భారిగా పీజీ హాస్టల్స్, ఐటీ కంపెనీలు ఉండడంతోనే ఫేక్ సర్టిఫికెట్స్ కు భారీగా డిమాండ్ ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.