15-11-2025 05:09:29 PM
హైదరాబాద్: సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రవి కరేబియన్ దీవుల నుండి వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు తేలింది. సినిమా విడుదల రోజే వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేయడం వల్ల తమకు ఆర్థిక నష్టం వాటిల్లిందని అనేక మంది చిత్ర నిర్మాతలు వెబ్‌సైట్‌పై కేసులు దాఖలు చేశారు. కానీ నిన్న ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కీలక సమచారం సేకరించారు. ఐబొమ్మ వెబ్‌సైట్, సర్వర్ నుంచి సమాచారం సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ వాసిగా గుర్తించారు. కూకట్ పల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఐబొమ్మ నిర్వాహకుడి నుంచి కంప్యూటర్లు, వందల హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. రవి వాడిన సర్వర్లు కూడా గుర్తించారు. ఇది ఇలా ఉంటే, సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు.
దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఐ బొమ్మ నిర్వహకులు పోలీసులకు సవాల్ చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమతో పాటు, పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ రవి బ్లాక్‌మెయిల్ చేశాడు. తన వెబ్‌సైట్‌పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రవి కోసం పోలీసులు గత 6 నెలలుగా గాలిస్తున్నారు. పైరసీ చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నందుకు చిత్రపరిశ్రమకు వేల కోట్లు నష్టం వాటిలిందని సీని నిర్మాతాలు వాపోతు వెబ్‌సైట్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. రవి బ్యాంకు ఖాతాలోని రూ. 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం.