15 June, 2026 | 7:12 PM

Breaking News

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •  

మ్యాట్రిమొనిలో ఫేక్ ప్రొఫైల్స్

04-11-2024 12:24 AM
  1. బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు 
  2. దంపతుల అరెస్టు

పెద్దపల్లి, సెప్టెంబర్ 3 (విజయక్రాం తి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండ లం హరిపురం గ్రామానికి చెందిన ఎర్ర వెంకట నాగరాజు, రామంచ సౌజన్య భార్యభర్తలు. ఇద్దరూ కలిసి తెలుగు మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో యువతుల పేరుతో ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి, యువకులకు రిక్వెస్ట్ పెడుతూ స్పందించిన వారిని నమ్మించి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు.

ఆరోగ్యం బాగా లేదని, హాస్పిటల్ ఖర్చులకంటూ డబ్బులు వసూలు చేసేవారు. మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి వీరి చేతిలో చిక్కుకుని రూ.17 లక్షలు మోసపోయినట్లు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని సైబర్ క్రైమ్ ఎస్‌హెచ్‌ఓ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కృష్ణమూర్తి కేసు దర్యాప్తు చేయగా నిందితులను గుర్తించి, ఆదివారం అరెస్టు చేశారు.