దేశంలో 21 నకిలీ వర్సిటీలు
22-08-2024 12:14 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశంలో ప్రస్తుతం 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయన, అవి జారీచేసే పట్టాలు ఎక్కడా చెల్లుబాటు కావని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బుధవారం ప్రకటించింది. వీటిలో దేశ రాజధాని ఢిల్లీలోనే అత్యధికంగా 8 ఫేక్ వర్సిటీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు నకిలీ వర్సిటీలు ఉన్నట్టు గుర్తించారు. ఏపీ, బెంగాల్, కేరళలో రెండు చొప్పున.. కర్ణాటక, మహారాష్ట్ర పుదుచ్చేరిలో ఒక్కొక్క నకిలీ యూనివర్సిటీ ఉన్నట్టు ప్రకటించింది. వీటికి ప్రభుత్వ గుర్తింపు లేదని, ఆ యూనివర్సిటీల్లో విద్యార్థులు చేరొద్దని సూచించింది.






