తండ్రి కొడుకు కారు ఫైట్
22-08-2024 12:13 AM
థానే, ఆగస్టు 21: తండ్రీ కొడుకు ల మధ్య ఘర్షణ స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. కొడుకు తండ్రి మీద కోపంతో కారుతో బీభ త్సం సృష్టించి భీతావహ వాతావరణాన్ని నెలకొల్పాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదో విషయంలో తండ్రీ కొడుకుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. కోపోద్రిక్తుడైన కుమారుడు తండ్రి ప్రయాణిస్తున్న కారు ను తన కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కొంత మంది అమాయకులకు గాయాలయ్యాయి. తండ్రి కారును వెనకాల నుంచి ఢీ కొట్టిన కుమారుడు.. కోపం చల్లారకపోవడంతో ముందుకు వెళ్లి రివర్స్ తీసు కుని వచ్చి ఢీ కొట్టాడు. తండ్రి ఫిర్యా దు మేరకు కొడుకుపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.






