3 June, 2026 | 8:33 PM

Breaking News

భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలి   •   ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మదన్మోహన్ లక్ష్యం   •   వాటర్ ట్యాంక్ రూములో యువకుడి అనుమానాస్పద మృతి   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష   •   కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్   •   కేంద్రంలో లీకేజీల ప్రభుత్వం   •   ముంపు ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటన‌   •   మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి సైకిల్ మేలు చేస్తుంది   •   జాబ్ కార్డులో నూతనంగా యువతీ, యువకుల పేర్లు నమోదు చేయాలి: జోగు అరవిందరెడ్డి   •   అప్పు కోసం విద్యుత్ సంస్ధల తాకట్టుకుయత్నం   •  

తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

11-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : నిర్మల్ మున్సిపల్ అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రభుత్వపరంగా మంజూరైన నిధులకు తాను మంజూరు చేయించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తే తన కృషితోనే నిధులు మంజూరయ్యాయని ప్రకటించుకున్న ఎమ్మెల్యే 60 కోట్ల నిధులు వెనక్కి మళ్ళిన ఎందుకు చర్యలు తీసుకోలేదని పూర్తిగా ప్రశ్నించారు.

నిర్మల్ పట్టణం లో 15 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను రద్దు చేయడం పై బిజెపి నాయకులు ధర్నా చేయడం సిగ్గుచేటు అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వారి ఎజెండా అని గుర్తు చేశారు. నిర్మల్ ఎమ్మెల్యేగా మున్సిపల్ అభివృద్ధికి ఆయన ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధిలో ముం దుంచాలనే లక్ష్యంతో కొత్తపాలకవర్గం పనిచేస్తుంది, అడ్డుకోవాల్సిన అవసరం తమ కు లేదన్నారు.

బీజేపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అబద్దపు మాటలు, తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు కత్తి నరేందర్, గోపు గోపి, ఎస్పి రాజు, లక్కాకుల హరీష్, నాయకులు అడప పోశెట్టి, ఆకుల రామకృష్ణ, చైతన్య, చారి,  తదితరులు పాల్గొన్నారు.