calender_icon.png 13 June, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత ఎమ్మెల్యే సామేలుపై అసత్య ఆరోపణలు తగదు

11-06-2025 03:22:36 PM

జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి జనార్దన్

తిరుమలగిరి,(విజయక్రాంతి): దళితుడైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్(Dalit MLA Mandula Samuel)ను చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు సుంకరి జనార్ధన్(Congress Leaders Sunkari Janardhan) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గం(Thungathurthi Constituency)లో నిత్యం ప్రజా సమస్యల కొరకు, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న ఎమ్మెల్యే మందుల సామెల్ ను బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది కుట్రలు కొనసాగిస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఎడిటింగ్ వీడియో మార్పింగ్ చేసి, ప్రజాదరణ చూరగొంటున్న ప్రజాభిమాని, మచ్చలేని మహా నాయకునిపై కుట్రబుద్ధితో ప్రజలలో అభాసపాలు చేయాలనే వక్రబుద్ధితో దొంగ వీడియోలు సృష్టించారని తెలిపారు.

తెలంగాణ మలిదశ ఉద్యమం నుండి 40 ఏళ్లుగా ప్రజాసేవే లక్ష్యంగా తెలంగాణ తల్లి(Telangana Thalli) తండ్లాటను చూసి, తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లు తెంచడానికి, స్వరాష్ట్ర సాధన కొరకు ముందుండి కలబడి నిలబడి పోరాడి తెలంగాణ రాష్ట్రం(Telangana State) సాధించడం కొరకు నిస్వార్ధంగా నిజాయితీగా పనిచేసిన దళిత బిడ్డ మన ఎమ్మెల్యే మందుల సామెల్ అని కొనియాడారు. కల్పిత వీడియోలు సృష్టించడం కాదు ఎమ్మెల్యే ఎక్కడ అవినీతి చేసినారో కుట్ర దారులు నిరూపించాలని దానికి బహిరంగ చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. ప్రత్యర్ధులు కుట్ర దారులు, ఎవరైనా నమ్మకద్రోహులు ఉంటే ఎన్ని కుట్రలు చేసిన ఎమ్మెల్యే ను ప్రజలలో అబాసు పాలు చేయాలని కోటి ప్రయత్నాలు చేసినా ప్రజల మనిషి సామెల్ ను ఏమీ చేయలేరని అన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో పొల్లు పొల్లు పొట్టు పొట్టు గా రాష్ట్రంలోని కనివిని ఎరగని రీతిలో 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ప్రజా నాయకుడిపై నిందలు వేస్తున్న వ్యక్తులు ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.

తుంగతుర్తి ప్రాంతం అభివృద్ధి కొరకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక దళిత ఎమ్మెల్యే గా, ప్రజా ఉద్యమ నాయకుడిగా పేరు ప్రతిష్టలు గావించబడి రాష్ట్ర రాజకీయాలలో ఉక్కు క్రమశిక్షణ కలిగిన,ఒక కమిటి మెంట్ గల వ్యక్తి మన ఎమ్మెల్యే అని కొనియాడారు. దేశంలో, రాష్ట్రంలో లిక్కర్ మాఫియాలో కోట్లాది రూపాయలు తీసుకొని జైలల్లో మగ్గిన ఎంతోమంది అవినీతి తిమింగలాలను విమర్శించలేక నిజాయితీకి నిలువుటద్దం అయిన ఎమ్మెల్యే  వైన్స్ షాపుల చందాలు అడిగినట్లుగా ఎడిటింగ్ వీడియోను చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.తుంగతుర్తి ప్రాంత అభివృద్ధి ప్రదాత, దళిత బిడ్డ, ప్రజాభిమానిపై ఇకనుండి ఎలాంటి కుట్రపూరితపు అసత్యపు ఆరోపణలు చేసిన వారు ప్రజాక్షేత్రం సునామీలో కొట్టుకపోవడం తప్పదని హెచ్చరించారు.